మహేష్ బాబు కాదు.. అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: అభిషేక్ శర్మ
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్, జయదేవ్ ఉనాద్కత్‌లతో కలిసి అభిషేక్ శర్మ సందడి చేశాడు. ఈ సందర్భంగా అభిమానులతో తెలుగు హీరోల గురించి అభిషేక్ శర్మ ముచ్చటించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు జై కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. 'మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా కమిట్ అయిపోతా'అని డైలాగ్ చెప్పిన అభిషేక్ శర్మ.. జై బాబు అని నినాదాలు చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి గతేడాది దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో ఫామ్ అందుకొని పూర్వవైభవం అందుకోవాలనే పట్టుదలతో ఈ తెలుగు తేజం ఉన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును విశ్లేషించిన ఇర్ఫాన్ పఠాన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'నితీష్ కుమార్ రెడ్డి తన ఆల్‌రౌండర్ పాత్రను సరిగ్గా పోషిస్తే.. ఈ అల్ట్రా-అగ్రెసివ్ టీమ్‌ను బ్యాలెన్స్ చేసే వ్యక్తిగా నిలుస్తాడు. గత ఏడాది అతను నిరాశపర్చాడు.